|
| 1 |
|
| నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల |
|
| 2 |
|
| జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల |
|
| 3 |
|
| తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల |
|
| 4 |
|
| వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల |
|
| 5 |
|
| యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. |
|
| 6 |
|
| యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. |
|
| 7 |
|
| ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. |
|
| 8 |
|
| న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. |
|
| 9 |
|
| అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. |
|
| 10 |
|
| జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును |
|
| 11 |
|
| బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. |
|
| 12 |
|
| అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును. |
|
| 13 |
|
| అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు |
|
| 14 |
|
| కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. |
|
| 15 |
|
| వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు |
|
| 16 |
|
| మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును. |
|
| 17 |
|
| అట్టి స్త్రీ తన ¸°వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. |
|
| 18 |
|
| దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును |
|
| 19 |
|
| దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల |
|
| 20 |
|
| నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. |
|
| 21 |
|
| యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. |
|
| 22 |
|
| భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు. |
|
|
: |
| ౧ | | ౨ | | ౩ | | ౪ | | ౫ | | ౬ | | ౭ | | ౮ | | ౯ | | ౧౦ | | ౧౧ | | ౧౨ | | ౧౩ | | ౧౪ | | ౧౫ | | ౧౬ | | ౧౭ | | ౧౮ | | ౧౯ | | ౨౦ | | ౨౧ | | ౨౨ | 1
1
1 |
|
|---|
|
https://beblia.bible:81/BibleAudio/telugu/proverbs/002.mp3
31
2