|
| 1 |
|
| యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: |
|
| 2 |
|
| “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.” |
|
| 3 |
|
| తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు. |
|
| 4 |
|
| అతని దళంలో ఉన్నవారు 74,600. |
|
| 5 |
|
| వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు. |
|
| 6 |
|
| అతని దళంలో ఉన్నవారు 54,400. |
|
| 7 |
|
| వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు. |
|
| 8 |
|
| అతని విభజనలో ఉన్నవారు 57,400. |
|
| 9 |
|
| యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు. |
|
| 10 |
|
| దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు. |
|
| 11 |
|
| అతని దళంలో ఉన్నవారు 46,500. |
|
| 12 |
|
| వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు. |
|
| 13 |
|
| అతని దళంలో ఉన్నవారు 59,300. |
|
| 14 |
|
| వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు. |
|
| 15 |
|
| అతని దళంలో ఉన్నవారు 45,650. |
|
| 16 |
|
| రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు. |
|
| 17 |
|
| తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు. |
|
| 18 |
|
| పడమర వైపు: ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు. |
|
| 19 |
|
| అతని దళంలో ఉన్నవారు 40,500. |
|
| 20 |
|
| మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు |
|
| 21 |
|
| అతని దళంలో ఉన్నవారు 32,200. |
|
| 22 |
|
| వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు. |
|
| 23 |
|
| అతని దళంలో ఉన్నవారు 35,400. |
|
| 24 |
|
| ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు. |
|
| 25 |
|
| ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు. |
|
| 26 |
|
| అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700. |
|
| 27 |
|
| ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు. |
|
| 28 |
|
| అతని దళంలో ఉన్నవారు 41,500. |
|
| 29 |
|
| వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు. |
|
| 30 |
|
| అతని దళంలో ఉన్నవారు 53,400. |
|
| 31 |
|
| దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు. |
|
| 32 |
|
| వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550. |
|
| 33 |
|
| యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు. |
|
| 34 |
|
| కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు. |
|
|
|
|