× భాషా యూరప్ రష్యన్ బెయిలోరష్యన్ ఉక్రేనియన్ పోలిష్ సెర్బియన్ బల్గేరియన్ స్లొవేకియా చెక్ రొమేనియన్ మోల్డోవియన్ అజెర్బైజాన్ అర్మేనియా జార్జియన్ అల్బేనియా అవర్ బాష్కిర్ టాటర్ చెచెన్ స్లోవేనియాన్ క్రొయెషియన్ ఎస్టోనియన్ లాట్వియన్ లిథుయేనియన్ హంగేరియన్ ఫిన్నిష్ నార్వేజియన్ స్వీడిష్ ఐస్లాండిక్ గ్రీకు మాసిడోనియన్ జర్మన్ బవేరియన్ డచ్ డానిష్ వెల్ష్ గేలిక్ ఐరిష్ ఫ్రెంచ్ బాస్క్ కాటలాన్ ఇటాలియన్ గెలాసియన్ రోమానీ Bosnian Kabardian ఉత్తర అమెరికా ఇంగ్లీష్ దక్షిణ అమెరికా స్పానిష్ పోర్చుగీస్ గ్వారానీ క్వెచువాన్ అయమారా మధ్య అమెరికా జమైకన్ నాహుఅటిల్ Kiche క్యూ'చి హైతియన్ తూర్పు ఆసియా చైనీస్ జపనీస్ కొరియన్ మంగోలియన్ ఉయ్ఘుర్ హ్మాంగ్ Tibetian ఆగ్నేయ ఆసియా మలేషియన్ బర్మీస్ హఖా చిన్ నేపాలీ సేబుఆనో తగలోగ్ కంబోడియన్ థాయ్ ఇండోనేషియన్ సుండనీస్ వియత్నమీస్ జావానీస్ లావో ఇబాన్ ఐయు మియన్ కచిన్ లాహు Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray దక్షిణ ఆసియా హిందీ ఒడియా అవధి మిజో కన్నడ మలయాళం మరాఠీ గుజరాతీ తమిళ తెలుగు పంజాబీ కురుఖ్ అస్సామీ మైథిలి బెంగాలీ ఉర్దూ సింహళ డోగ్రీ హర్యాన్వి మెయిటీ కొంకణి సంతాలి సింధీ కోయా థాడో సంస్కృత దేవనాగరి Adilabad Gondi Ahirani బలూచి Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu మధ్య ఆసియా కిర్గిజ్ ఉజ్బెక్ తాజిక్ తుర్క్మెన్ కజాఖ్స్తాన్ కరకల్పక్ మిడిల్ ఈస్ట్ టర్కిష్ హిబ్రూ అరబిక్ పెర్షియన్ కర్డిష్ Mazanderani పాష్టో కోప్టిక్ ఆఫ్రికా ఆఫ్రికాన్స్ షోసా జూలూ దెబెలె సోతో అమ్హారిక్ వోలాయిట్టా నైజీరియా మోసి ఇకా డింకా కాబిల్ ఈవీ స్వాహిలి మొరాకో సోమాలియన్ షోన మడగాస్కర్ ఇగ్బో లింగాల బౌలే సిస్వాతి సోంగా త్వానా గాంబియా యోరుబా కంబా కిన్యార్వాండా హౌసా చేవా లువో మకువా డ్యూలా ఫుల్ ఫుల్డే కలేంజిన్ కికుయు కిక్వాంగో కిరుండి క్రియో నైజీరియన్ పిడ్జిన్ ఒరోమో త్శిలుబా త్శివేంద ట్వి ఉంబుండు లుగ్బారా లుగురు పుల్లర్ గుస్సీ మాసాయి తుర్కానా మొబా న్యూయర్ షిల్లుక్ తమాషేక్ మాకొండే Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba ఆస్ట్రేలియా ఖండం న్యూజిలాండ్ పాపువా న్యూ గినియా పాత భాషలు అరామిక్ లాటిన్ ఎస్పరెన్టొ 1 1 1 పరిశుద్ధ గ్రంథము ౨౦౧౬ [2016] తెలుగు సమకాలీన ౨౦౨౪ [2024]ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ౨౦౧౯ [2019]పరిశుద్ధ గ్రంథము ౨౦౧౬ [2016]పవిత్ర బైబిల్ ౧౯౯౭ [1997]BSI ౧౮౮౦ [1880]1 1 1 మాథ్యూ ఆదికాండముఎక్సోడస్లెవిటికస్సంఖ్యలుద్వితీయోపదేశకాండముజాషువాన్యాయమూర్తులురూత్౧ సమూయేలు౨ సమూయేలు౧ రాజులు౨ రాజులు౧ క్రానికల్స్౨ క్రానికల్స్ఎజ్రానెహెమ్యాఎస్తేర్ఉద్యోగంకీర్తనలుసామెతలుప్రసంగిసాంగ్ అఫ్ సోలోమోన్యెషయాయిర్మీయావిలాపవాక్యములుయెహెజ్కేలుడేనియల్హోషేయాజోయెల్అమోస్ఓబద్యాజోనామీకానహుంహబక్కూకుజెఫన్యాహగ్గయిజెకర్యామలాకీ--- --- ---మాథ్యూమార్క్ల్యూక్జాన్చట్టాలురోమన్లు౧ కోరింతియన్స్౨ కోరింతియన్స్గలతీయులకుఎఫెసీయులకుఫిలిప్పీయులకుకొలస్సీయులకు౧ థెస్సలొనీకయులు౨ థెస్సలొనీకయులు౧ తిమోతి౨ తిమోతితీతుకుఫిలేమోనుహెబ్రీయులుజేమ్స్౧ పేతురు౨ పేతురు౧ జాన్౨ జాన్౩ జాన్జూడ్ప్రకటన1 1 1 ౬ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬౧౭౧౮౧౯౨౦౨౧౨౨౨౩౨౪౨౫౨౬౨౭౨౮1 1 1 : ౧ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬౧౭౧౮౧౯౨౦౨౧౨౨౨౩౨౪౨౫౨౬౨౭౨౮౨౯౩౦౩౧౩౨౩౩1 1 1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) మాథ్యూ ౬ గమనికలను సేవ్ చేయండి ౧ [1]మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పర లోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.౨ [2]కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.౩ [3]నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.౪ [4]అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.౫ [5]మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.౬ [6]నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.౭ [7]మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;౮ [8]మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును;౯ [9][9-10] కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, —పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక,౧౦ [10]మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.౧౧ [11]మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.౧౨ [12]మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.౧౩ [13]మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.౧౪ [14]మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.౧౫ [15]మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.౧౬ [16]ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.౧౭ [17]అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.౧౮ [18]భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.౧౯ [19]పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.౨౦ [20]నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.౨౧ [21]దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.౨౨ [22]నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది.౨౩ [23]ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.౨౪ [24]అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా?౨౫ [25]ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా?౨౬ [26]మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?౨౭ [27]వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు౨౮ [28]అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.౨౯ [29]నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.౩౦ [30]కాబట్టి— ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.౩౧ [31]ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.౩౨ [32]కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.౩౩ [33]రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.Telugu Bible (TELOV) 2016 Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) మాథ్యూ ౬ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/telugu2016/matthew/006.mp3 28 6