అంశంపై బైబిల్ వచనాలుఅంశాల దేవుడు ఆశీర్వాదం మీరు ఉన్నట్లే రండి కమాండ్మెంట్స్ శాపం ఆర్థిక ఆశీర్వాదం ఫ్రీ విల్ దేవుని దయ దేవుని ప్రేమ దేవుని చిత్తం దేవుని (సమయం) నేను నిన్ను ఎప్పటికి వదలను అద్భుతాలు దేవుని పేర్లు దేవునికి సమర్పణలు ప్రణాళికలు పాపం నుండి రక్షింపబడుతోంది త్రిమూర్తులు సమయం ఏమీ కోరని ప్రేమ వైరస్లు / వ్యాధులు దేవుడు ఎవరు మంచి పాత్ర అంగీకారం సంయమనాన్ని జవాబుదారీ ధైర్యం సంరక్షణ శుభ్రత నిబద్ధత విశ్వాసం సంతృప్తి ధైర్యం / ధైర్య కరుణ క్రమశిక్షణ విశ్వాసం కృతజ్ఞతతో ఆతిథ్యం వినయం నిజాయితీ గౌరవం సమగ్రత దయ ప్రేమ నమ్రత దయ సహనం పవిత్రీకరణ స్వయం నియంత్రణ నమ్మండి చెడ్డ అక్షరం కోపం బిట్రేయల్ బెదిరింపు తీవ్రం ఫిర్యాదు సంఘర్షణ భయం మూర్ఖుడు కపట అసూయ తీర్పు సోమరితనం అహంకారం పగ / ప్రతీకారం గర్వం హింస పాపాలు పిల్లల గర్భస్రావం వ్యసనం వ్యభిచారం స్వధర్మ త్యాగము శాపము విడాకులు అసూయ వివాహేతర సంబంధం తిండిపోతు గాసిప్ దురాశ ద్వేషం కామం అబద్ధం హస్త ప్రయోగం ప్రోస్ట్రాస్టినేషన్ దొంగతనం లైఫ్ వృద్ధాప్యం జంతువులు పిల్లవాడిని దత్తత పుట్టినరోజు మెడిసిన్ ఒంటరిగా ఉండటం డేటింగ్ వ్యక్తులు మరణం డిప్రెషన్ నిరాశ వివేచన వ్యాయామం నీతి ఉపవాసం ప్రేమను కనుగొనడం ఫోకస్ కుటుంబం ఆహారం అపరాధం ఆరోగ్యం ఆనందం నరకం వంధ్యత్వం ఉద్యోగ నష్టం నష్టం మానసిక అనారోగ్యము సంగీతం వివాహం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నొప్పి పేరెంటింగ్ పోరాటం సెక్స్ ప్రయత్నాలు టెంప్టేషన్ పురుషుల కోసం శ్లోకాలు మహిళలకు శ్లోకాలు యుద్ధం సంపద వితంతువులు చర్చి చర్చికి హాజరవుతున్నారు యేసు జననం చర్చి హింస దానధర్మాలను తప్పుడు ఉపాధ్యాయులు స్వర్గానికి వెళుతోంది పరిశుద్ధ ఆత్మ బైబిల్లో మెస్సీయ పాస్టర్ భగవంతుడిని స్తుతించడం యేసు నుండి ఉపమానాలు పెంతేకొస్తు భాషలలో మాట్లాడటం తిథింగ్ ఆరాధన మహిళల పాత్రలు మిస్టరీస్ ఎలియెన్స్ క్యాన్సర్ డెస్టినీ డైనోసార్ల డ్రాగన్స్ కలలు ఫ్లాట్ లేదా రౌండ్ ఎర్త్ బైబిల్లో జెయింట్స్ లాస్ట్ డేస్ ఫ్యూచర్ యునికార్న్స్ ఏంజిల్స్ అండ్ డెమన్స్ దూతలచే ఏంజిల్స్ దయ్యపు డెమన్స్ గార్డియన్ ఏంజిల్స్ లూసిఫెర్ మాంత్రికుడు / మేజిక్ గణిత సంకేతాలు సంఖ్య ౩ సంఖ్య ౫ సంఖ్య ౭ సంఖ్య ౮ సంఖ్య ౧౦ అదనపు మద్యం సమృద్ధి అసహాయం బ్రోకెన్ హార్ట్ నరమాంస మరణశిక్ష డ్రగ్స్ చెడు భావోద్వేగాలు హాలోవీన్ పేదలకు సహాయం గర్భస్రావం పోలీసులు కుట్లు / చెవిపోగులు బహుభార్యాత్వం పునరుద్ధరణ విచారం సైన్స్ ఆత్మరక్షణ బానిసత్వం ఆత్మహత్య టాలెంట్ పచ్చబొట్లు పని చెడ్డ అక్షరం: [గర్వం] ప్రసంగి ౨:౧-౨౧[౧] కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; —నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.౹ [౨] నవ్వుతో— నీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతో–నీచేత కలుగునదేమియనియు నేవంటిని.౹ [౩] నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.౹ [౪] నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.౹ [౫] నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.౹ [౬] వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.౹ [౭] పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.౹ [౮] నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.౹ [౯] నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.౹ [౧౦] నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.౹ [౧౧] అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. [౧౨] రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని.౹ [౧౩] అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని.౹ [౧౪] జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని.౹ [౧౫] కావున–బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే.౹ [౧౬] బుద్ధిహీనులనుగూర్చినట్లుగానే జ్ఞానులనుగూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే.౹ [౧౭] ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను–అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. [౧౮] సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.౹ [౧౯] వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడైయుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.౹ [౨౦] కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.౹ [౨౧] ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.౹ ప్రసంగి ౪:౪మరియు కష్టమంతయు నేర్పుతోకూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకైచేయు ప్రయత్నమువలెనున్నది.౹ప్రసంగి ౫:౧౦ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే.౹ప్రసంగి ౬:౨ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.౹యిర్మీయా ౨:౫యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?యిర్మీయా ౪:౩౦దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.౹సామెతలు ౩౧:౩౦అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడునుకీర్తనలు ౩౯:౫-౬[౫] నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. (సెలా.) [౬] మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు.వారు తొందరపడుట గాలికే గదావారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. కీర్తనలు ౧౧౯:౩౭వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము.రోమన్లు ౧౨:౨మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.౧ సమూయేలు ౧౬:౭అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.౹౧ తిమోతి ౪:౮శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.౹ప్రసంగి ౧:౧-౨[౧] దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు. [౨] –వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.౹ గలతీయులకు ౫:౧౬-౨౬[౧౬] నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹ [౧౭] శరీరము ఆత్మ కును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయ కుందురు.౹ [౧౮] మీరు ఆత్మ చేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.౹ [౧౯] శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ [౨౦] విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ [౨౧] భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ [౨౨] అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.౹ [౨౩] [23-24] ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. [౨౪] మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మ ను అనుసరించి క్రమముగా నడుచుకొందము.౹ [౨౫] ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము. [౨౬] సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.౹ Telugu Bible (TELOV) 2016 Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide