అంశంపై బైబిల్ వచనాలుఅంశాల దేవుడు ఆశీర్వాదం మీరు ఉన్నట్లే రండి కమాండ్మెంట్స్ శాపం ఆర్థిక ఆశీర్వాదం ఫ్రీ విల్ దేవుని దయ దేవుని ప్రేమ దేవుని చిత్తం దేవుని (సమయం) నేను నిన్ను ఎప్పటికి వదలను అద్భుతాలు దేవుని పేర్లు దేవునికి సమర్పణలు ప్రణాళికలు పాపం నుండి రక్షింపబడుతోంది త్రిమూర్తులు సమయం ఏమీ కోరని ప్రేమ వైరస్లు / వ్యాధులు దేవుడు ఎవరు మంచి పాత్ర అంగీకారం సంయమనాన్ని జవాబుదారీ ధైర్యం సంరక్షణ శుభ్రత నిబద్ధత విశ్వాసం సంతృప్తి ధైర్యం / ధైర్య కరుణ క్రమశిక్షణ విశ్వాసం కృతజ్ఞతతో ఆతిథ్యం వినయం నిజాయితీ గౌరవం సమగ్రత దయ ప్రేమ నమ్రత దయ సహనం పవిత్రీకరణ స్వయం నియంత్రణ నమ్మండి చెడ్డ అక్షరం కోపం బిట్రేయల్ బెదిరింపు తీవ్రం ఫిర్యాదు సంఘర్షణ భయం మూర్ఖుడు కపట అసూయ తీర్పు సోమరితనం అహంకారం పగ / ప్రతీకారం గర్వం హింస పాపాలు పిల్లల గర్భస్రావం వ్యసనం వ్యభిచారం స్వధర్మ త్యాగము శాపము విడాకులు అసూయ వివాహేతర సంబంధం తిండిపోతు గాసిప్ దురాశ ద్వేషం కామం అబద్ధం హస్త ప్రయోగం ప్రోస్ట్రాస్టినేషన్ దొంగతనం లైఫ్ వృద్ధాప్యం జంతువులు పిల్లవాడిని దత్తత పుట్టినరోజు మెడిసిన్ ఒంటరిగా ఉండటం డేటింగ్ వ్యక్తులు మరణం డిప్రెషన్ నిరాశ వివేచన వ్యాయామం నీతి ఉపవాసం ప్రేమను కనుగొనడం ఫోకస్ కుటుంబం ఆహారం అపరాధం ఆరోగ్యం ఆనందం నరకం వంధ్యత్వం ఉద్యోగ నష్టం నష్టం మానసిక అనారోగ్యము సంగీతం వివాహం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నొప్పి పేరెంటింగ్ పోరాటం సెక్స్ ప్రయత్నాలు టెంప్టేషన్ పురుషుల కోసం శ్లోకాలు మహిళలకు శ్లోకాలు యుద్ధం సంపద వితంతువులు చర్చి చర్చికి హాజరవుతున్నారు యేసు జననం చర్చి హింస దానధర్మాలను తప్పుడు ఉపాధ్యాయులు స్వర్గానికి వెళుతోంది పరిశుద్ధ ఆత్మ బైబిల్లో మెస్సీయ పాస్టర్ భగవంతుడిని స్తుతించడం యేసు నుండి ఉపమానాలు పెంతేకొస్తు భాషలలో మాట్లాడటం తిథింగ్ ఆరాధన మహిళల పాత్రలు మిస్టరీస్ ఎలియెన్స్ క్యాన్సర్ డెస్టినీ డైనోసార్ల డ్రాగన్స్ కలలు ఫ్లాట్ లేదా రౌండ్ ఎర్త్ బైబిల్లో జెయింట్స్ లాస్ట్ డేస్ ఫ్యూచర్ యునికార్న్స్ ఏంజిల్స్ అండ్ డెమన్స్ దూతలచే ఏంజిల్స్ దయ్యపు డెమన్స్ గార్డియన్ ఏంజిల్స్ లూసిఫెర్ మాంత్రికుడు / మేజిక్ గణిత సంకేతాలు సంఖ్య ౩ సంఖ్య ౫ సంఖ్య ౭ సంఖ్య ౮ సంఖ్య ౧౦ అదనపు మద్యం సమృద్ధి అసహాయం బ్రోకెన్ హార్ట్ నరమాంస మరణశిక్ష డ్రగ్స్ చెడు భావోద్వేగాలు హాలోవీన్ పేదలకు సహాయం గర్భస్రావం పోలీసులు కుట్లు / చెవిపోగులు బహుభార్యాత్వం పునరుద్ధరణ విచారం సైన్స్ ఆత్మరక్షణ బానిసత్వం ఆత్మహత్య టాలెంట్ పచ్చబొట్లు పని చర్చి: [పరిశుద్ధ ఆత్మ] న్యాయమూర్తులు ౩:౧౦-౧౪[౧౦] యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, అతడు కూషన్రిషాతాయిమును జయించెను.౹ [౧౧] అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను. [౧౨] ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.౹ [౧౩] అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.౹ [౧౪] ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.౹ మాథ్యూ ౧౨:౩౧-౩౩[౩౧] కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. [౩౨] మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. [౩౩] చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. ల్యూక్ ౨౪:౪౫-౪౯[౪౫] అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి [౪౬] –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు [౪౭] యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. [౪౮] ఈ సంగతులకు మీరే సాక్షులు. [౪౯] ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. జాన్ ౩:౬-౮[౬] శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ యునై యున్నది.౹ [౭] మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.౹ [౮] గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.౹ రోమన్లు ౮:౨-౬[౨] క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.౹ [౩] [3-4] శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.౹ [౪] *** [౫] శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;౹ [౬] ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.౹ ౨ కోరింతియన్స్ ౫:౧౬-౧౮[౧౬] కావున ఇకమీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.౹ [౧౭] కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ [౧౮] సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.౹ ౧ క్రానికల్స్ ౧౨:౧౮-౨౦[౧౮] అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై–దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.౹ [౧౯] సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతోకూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.౹ [౨౦] అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.౹ కీర్తనలు ౫౨:౧-౩[౧] ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. [1] శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. [౨] మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది [౩] మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము. (సెలా.) మీకా ౩:౮-౧౦[౮] నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.౹ [౯] యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.౹ [౧౦] నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.౹ చట్టాలు ౨:౧-౫[౧] పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.౹ [౨] అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.౹ [౩] మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ౹ [౪] అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. [౫] ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.౹ ల్యూక్ ౨౪:౪౫-౪౭[౪౫] అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి [౪౬] –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు [౪౭] యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ౧ జాన్ ౨:౧౯-౨౭[౧౯] వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతోకూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లువారు బయలువెళ్లిరి.౹ [౨౦] అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.౹ [౨౧] మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.౹ [౨౨] యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹ [౨౩] కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.౹ [౨౪] అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.౹ [౨౫] నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.౹ [౨౬] మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.౹ [౨౭] అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు ౹ Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India