అంశంపై బైబిల్ వచనాలుఅంశాల దేవుడు ఆశీర్వాదం మీరు ఉన్నట్లే రండి కమాండ్మెంట్స్ శాపం ఆర్థిక ఆశీర్వాదం ఫ్రీ విల్ దేవుని దయ దేవుని ప్రేమ దేవుని చిత్తం దేవుని (సమయం) నేను నిన్ను ఎప్పటికి వదలను అద్భుతాలు దేవుని పేర్లు దేవునికి సమర్పణలు ప్రణాళికలు పాపం నుండి రక్షింపబడుతోంది త్రిమూర్తులు సమయం ఏమీ కోరని ప్రేమ వైరస్లు / వ్యాధులు దేవుడు ఎవరు మంచి పాత్ర అంగీకారం సంయమనాన్ని జవాబుదారీ ధైర్యం సంరక్షణ శుభ్రత నిబద్ధత విశ్వాసం సంతృప్తి ధైర్యం / ధైర్య కరుణ క్రమశిక్షణ విశ్వాసం కృతజ్ఞతతో ఆతిథ్యం వినయం నిజాయితీ గౌరవం సమగ్రత దయ ప్రేమ నమ్రత దయ సహనం పవిత్రీకరణ స్వయం నియంత్రణ నమ్మండి చెడ్డ అక్షరం కోపం బిట్రేయల్ బెదిరింపు తీవ్రం ఫిర్యాదు సంఘర్షణ భయం మూర్ఖుడు కపట అసూయ తీర్పు సోమరితనం అహంకారం పగ / ప్రతీకారం గర్వం హింస పాపాలు పిల్లల గర్భస్రావం వ్యసనం వ్యభిచారం స్వధర్మ త్యాగము శాపము విడాకులు అసూయ వివాహేతర సంబంధం తిండిపోతు గాసిప్ దురాశ ద్వేషం కామం అబద్ధం హస్త ప్రయోగం ప్రోస్ట్రాస్టినేషన్ దొంగతనం లైఫ్ వృద్ధాప్యం జంతువులు పిల్లవాడిని దత్తత పుట్టినరోజు మెడిసిన్ ఒంటరిగా ఉండటం డేటింగ్ వ్యక్తులు మరణం డిప్రెషన్ నిరాశ వివేచన వ్యాయామం నీతి ఉపవాసం ప్రేమను కనుగొనడం ఫోకస్ కుటుంబం ఆహారం అపరాధం ఆరోగ్యం ఆనందం నరకం వంధ్యత్వం ఉద్యోగ నష్టం నష్టం మానసిక అనారోగ్యము సంగీతం వివాహం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నొప్పి పేరెంటింగ్ పోరాటం సెక్స్ ప్రయత్నాలు టెంప్టేషన్ పురుషుల కోసం శ్లోకాలు మహిళలకు శ్లోకాలు యుద్ధం సంపద వితంతువులు చర్చి చర్చికి హాజరవుతున్నారు యేసు జననం చర్చి హింస దానధర్మాలను తప్పుడు ఉపాధ్యాయులు స్వర్గానికి వెళుతోంది పరిశుద్ధ ఆత్మ బైబిల్లో మెస్సీయ పాస్టర్ భగవంతుడిని స్తుతించడం యేసు నుండి ఉపమానాలు పెంతేకొస్తు భాషలలో మాట్లాడటం తిథింగ్ ఆరాధన మహిళల పాత్రలు మిస్టరీస్ ఎలియెన్స్ క్యాన్సర్ డెస్టినీ డైనోసార్ల డ్రాగన్స్ కలలు ఫ్లాట్ లేదా రౌండ్ ఎర్త్ బైబిల్లో జెయింట్స్ లాస్ట్ డేస్ ఫ్యూచర్ యునికార్న్స్ ఏంజిల్స్ అండ్ డెమన్స్ దూతలచే ఏంజిల్స్ దయ్యపు డెమన్స్ గార్డియన్ ఏంజిల్స్ లూసిఫెర్ మాంత్రికుడు / మేజిక్ గణిత సంకేతాలు సంఖ్య ౩ సంఖ్య ౫ సంఖ్య ౭ సంఖ్య ౮ సంఖ్య ౧౦ అదనపు మద్యం సమృద్ధి అసహాయం బ్రోకెన్ హార్ట్ నరమాంస మరణశిక్ష డ్రగ్స్ చెడు భావోద్వేగాలు హాలోవీన్ పేదలకు సహాయం గర్భస్రావం పోలీసులు కుట్లు / చెవిపోగులు బహుభార్యాత్వం పునరుద్ధరణ విచారం సైన్స్ ఆత్మరక్షణ బానిసత్వం ఆత్మహత్య టాలెంట్ పచ్చబొట్లు పని చర్చి: [పాస్టర్] ౨ తిమోతి ౪:౨వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంత ముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.౹చట్టాలు ౨౦:౨౮దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.౹హెబ్రీయులు ౧౩:౧౭మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.జేమ్స్ ౩:౧నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.౹యిర్మీయా ౩:౧౫నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.౹సామెతలు ౨౩:౨౭వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.ఎఫెసీయులకు ౪:౧౧-౧౨[౧౧] [11-12] మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.౹ [౧౨] *** ౧ పేతురు ౫:౧-౪[౧] తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.౹ [౨] బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.౹ [౩] మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;౹ [౪] ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.౹ తీతుకు ౧:౫-౯[౫] నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.౹ [౬] ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.౹ [౭] ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,౹ [౮] అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునైయుండి,౹ [౯] తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను. యెహెజ్కేలు ౩౪:౧-౧౦[౧] మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను [౨] –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.౹ [౩] మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,౹ [౪] బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.౹ [౫] కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.౹ [౬] నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.౹ [౭] కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి [౮] –కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ [౯] కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.౹ [౧౦] –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ ౧ తిమోతి ౩:౧-౧౩[౧] ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.౹ [౨] [2-3] అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై,౹ [౩] *** [౪] సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.౹ [౫] ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?౹ [౬] అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.౹ [౭] మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.౹ [౮] ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక౹ [౯] విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.౹ [౧౦] మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.౹ [౧౧] అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.౹ [౧౨] పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.౹ [౧౩] పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యముగలవారగుదురు. Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India