అంశంపై బైబిల్ వచనాలుఅంశాల దేవుడు ఆశీర్వాదం మీరు ఉన్నట్లే రండి కమాండ్మెంట్స్ శాపం ఆర్థిక ఆశీర్వాదం ఫ్రీ విల్ దేవుని దయ దేవుని ప్రేమ దేవుని చిత్తం దేవుని (సమయం) నేను నిన్ను ఎప్పటికి వదలను అద్భుతాలు దేవుని పేర్లు దేవునికి సమర్పణలు ప్రణాళికలు పాపం నుండి రక్షింపబడుతోంది త్రిమూర్తులు సమయం ఏమీ కోరని ప్రేమ వైరస్లు / వ్యాధులు దేవుడు ఎవరు మంచి పాత్ర అంగీకారం సంయమనాన్ని జవాబుదారీ ధైర్యం సంరక్షణ శుభ్రత నిబద్ధత విశ్వాసం సంతృప్తి ధైర్యం / ధైర్య కరుణ క్రమశిక్షణ విశ్వాసం కృతజ్ఞతతో ఆతిథ్యం వినయం నిజాయితీ గౌరవం సమగ్రత దయ ప్రేమ నమ్రత దయ సహనం పవిత్రీకరణ స్వయం నియంత్రణ నమ్మండి చెడ్డ అక్షరం కోపం బిట్రేయల్ బెదిరింపు తీవ్రం ఫిర్యాదు సంఘర్షణ భయం మూర్ఖుడు కపట అసూయ తీర్పు సోమరితనం అహంకారం పగ / ప్రతీకారం గర్వం హింస పాపాలు పిల్లల గర్భస్రావం వ్యసనం వ్యభిచారం స్వధర్మ త్యాగము శాపము విడాకులు అసూయ వివాహేతర సంబంధం తిండిపోతు గాసిప్ దురాశ ద్వేషం కామం అబద్ధం హస్త ప్రయోగం ప్రోస్ట్రాస్టినేషన్ దొంగతనం లైఫ్ వృద్ధాప్యం జంతువులు పిల్లవాడిని దత్తత పుట్టినరోజు మెడిసిన్ ఒంటరిగా ఉండటం డేటింగ్ వ్యక్తులు మరణం డిప్రెషన్ నిరాశ వివేచన వ్యాయామం నీతి ఉపవాసం ప్రేమను కనుగొనడం ఫోకస్ కుటుంబం ఆహారం అపరాధం ఆరోగ్యం ఆనందం నరకం వంధ్యత్వం ఉద్యోగ నష్టం నష్టం మానసిక అనారోగ్యము సంగీతం వివాహం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నొప్పి పేరెంటింగ్ పోరాటం సెక్స్ ప్రయత్నాలు టెంప్టేషన్ పురుషుల కోసం శ్లోకాలు మహిళలకు శ్లోకాలు యుద్ధం సంపద వితంతువులు చర్చి చర్చికి హాజరవుతున్నారు యేసు జననం చర్చి హింస దానధర్మాలను తప్పుడు ఉపాధ్యాయులు స్వర్గానికి వెళుతోంది పరిశుద్ధ ఆత్మ బైబిల్లో మెస్సీయ పాస్టర్ భగవంతుడిని స్తుతించడం యేసు నుండి ఉపమానాలు పెంతేకొస్తు భాషలలో మాట్లాడటం తిథింగ్ ఆరాధన మహిళల పాత్రలు మిస్టరీస్ ఎలియెన్స్ క్యాన్సర్ డెస్టినీ డైనోసార్ల డ్రాగన్స్ కలలు ఫ్లాట్ లేదా రౌండ్ ఎర్త్ బైబిల్లో జెయింట్స్ లాస్ట్ డేస్ ఫ్యూచర్ యునికార్న్స్ ఏంజిల్స్ అండ్ డెమన్స్ దూతలచే ఏంజిల్స్ దయ్యపు డెమన్స్ గార్డియన్ ఏంజిల్స్ లూసిఫెర్ మాంత్రికుడు / మేజిక్ గణిత సంకేతాలు సంఖ్య ౩ సంఖ్య ౫ సంఖ్య ౭ సంఖ్య ౮ సంఖ్య ౧౦ అదనపు మద్యం సమృద్ధి అసహాయం బ్రోకెన్ హార్ట్ నరమాంస మరణశిక్ష డ్రగ్స్ చెడు భావోద్వేగాలు హాలోవీన్ పేదలకు సహాయం గర్భస్రావం పోలీసులు కుట్లు / చెవిపోగులు బహుభార్యాత్వం పునరుద్ధరణ విచారం సైన్స్ ఆత్మరక్షణ బానిసత్వం ఆత్మహత్య టాలెంట్ పచ్చబొట్లు పని లైఫ్: [పుట్టినరోజు] ఎఫెసీయులకు ౨:౧౦మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.యిర్మీయా ౨౯:౧౧నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹జాన్ ౧౬:౨౧స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.౹సామెతలు ౯:౧౧నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.కీర్తనలు ౧౬:౧౧జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.కీర్తనలు ౨౦:౪నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.కీర్తనలు ౨౭:౪-౭[౪] యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర ములో నివసింప గోరుచున్నాను. [౫] ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. [౬] ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను. [౭] యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. కీర్తనలు ౯౦:౧౨మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.కీర్తనలు ౯౧:౧౧నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించునుకీర్తనలు ౯౧:౧౬దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.కీర్తనలు ౧౧౮:౨౪ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.జెఫన్యా ౩:౧౭నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.౹కీర్తనలు ౩౭:౪-౫[౪] యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. [౫] నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. విలాపవాక్యములు ౩:౨౨-౨౩[౨౨] యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. [౨౩] అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. సంఖ్యలు ౬:౨౪-౨౬[౨౪] యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;౹ [౨౫] యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;౹ [౨౬] యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లువారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను. కీర్తనలు ౧౩౯:౧-౨౪[౧] ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు [౨] నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. [౩] నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. [౪] యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. [౫] వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. [౬] ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. [౭] నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? [౮] నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు [౯] నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను [౧౦] అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును [౧౧] –అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనినయెడల [౧౨] చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి [౧౩] నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. [౧౪] నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. [౧౫] నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు [౧౬] నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. [౧౭] దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. [౧౮] వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును. [౧౯] దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి. [౨౦] వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు. [౨౧] యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా! [౨౨] వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను [౨౩] దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము [౨౪] నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము. Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India