అంశంపై బైబిల్ వచనాలుఅంశాల దేవుడు ఆశీర్వాదం మీరు ఉన్నట్లే రండి కమాండ్మెంట్స్ శాపం ఆర్థిక ఆశీర్వాదం ఫ్రీ విల్ దేవుని దయ దేవుని ప్రేమ దేవుని చిత్తం దేవుని (సమయం) నేను నిన్ను ఎప్పటికి వదలను అద్భుతాలు దేవుని పేర్లు దేవునికి సమర్పణలు ప్రణాళికలు పాపం నుండి రక్షింపబడుతోంది త్రిమూర్తులు సమయం ఏమీ కోరని ప్రేమ వైరస్లు / వ్యాధులు దేవుడు ఎవరు మంచి పాత్ర అంగీకారం సంయమనాన్ని జవాబుదారీ ధైర్యం సంరక్షణ శుభ్రత నిబద్ధత విశ్వాసం సంతృప్తి ధైర్యం / ధైర్య కరుణ క్రమశిక్షణ విశ్వాసం కృతజ్ఞతతో ఆతిథ్యం వినయం నిజాయితీ గౌరవం సమగ్రత దయ ప్రేమ నమ్రత దయ సహనం పవిత్రీకరణ స్వయం నియంత్రణ నమ్మండి చెడ్డ అక్షరం కోపం బిట్రేయల్ బెదిరింపు తీవ్రం ఫిర్యాదు సంఘర్షణ భయం మూర్ఖుడు కపట అసూయ తీర్పు సోమరితనం అహంకారం పగ / ప్రతీకారం గర్వం హింస పాపాలు పిల్లల గర్భస్రావం వ్యసనం వ్యభిచారం స్వధర్మ త్యాగము శాపము విడాకులు అసూయ వివాహేతర సంబంధం తిండిపోతు గాసిప్ దురాశ ద్వేషం కామం అబద్ధం హస్త ప్రయోగం ప్రోస్ట్రాస్టినేషన్ దొంగతనం లైఫ్ వృద్ధాప్యం జంతువులు పిల్లవాడిని దత్తత పుట్టినరోజు మెడిసిన్ ఒంటరిగా ఉండటం డేటింగ్ వ్యక్తులు మరణం డిప్రెషన్ నిరాశ వివేచన వ్యాయామం నీతి ఉపవాసం ప్రేమను కనుగొనడం ఫోకస్ కుటుంబం ఆహారం అపరాధం ఆరోగ్యం ఆనందం నరకం వంధ్యత్వం ఉద్యోగ నష్టం నష్టం మానసిక అనారోగ్యము సంగీతం వివాహం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నొప్పి పేరెంటింగ్ పోరాటం సెక్స్ ప్రయత్నాలు టెంప్టేషన్ పురుషుల కోసం శ్లోకాలు మహిళలకు శ్లోకాలు యుద్ధం సంపద వితంతువులు చర్చి చర్చికి హాజరవుతున్నారు యేసు జననం చర్చి హింస దానధర్మాలను తప్పుడు ఉపాధ్యాయులు స్వర్గానికి వెళుతోంది పరిశుద్ధ ఆత్మ బైబిల్లో మెస్సీయ పాస్టర్ భగవంతుడిని స్తుతించడం యేసు నుండి ఉపమానాలు పెంతేకొస్తు భాషలలో మాట్లాడటం తిథింగ్ ఆరాధన మహిళల పాత్రలు మిస్టరీస్ ఎలియెన్స్ క్యాన్సర్ డెస్టినీ డైనోసార్ల డ్రాగన్స్ కలలు ఫ్లాట్ లేదా రౌండ్ ఎర్త్ బైబిల్లో జెయింట్స్ లాస్ట్ డేస్ ఫ్యూచర్ యునికార్న్స్ ఏంజిల్స్ అండ్ డెమన్స్ దూతలచే ఏంజిల్స్ దయ్యపు డెమన్స్ గార్డియన్ ఏంజిల్స్ లూసిఫెర్ మాంత్రికుడు / మేజిక్ గణిత సంకేతాలు సంఖ్య ౩ సంఖ్య ౫ సంఖ్య ౭ సంఖ్య ౮ సంఖ్య ౧౦ అదనపు మద్యం సమృద్ధి అసహాయం బ్రోకెన్ హార్ట్ నరమాంస మరణశిక్ష డ్రగ్స్ చెడు భావోద్వేగాలు హాలోవీన్ పేదలకు సహాయం గర్భస్రావం పోలీసులు కుట్లు / చెవిపోగులు బహుభార్యాత్వం పునరుద్ధరణ విచారం సైన్స్ ఆత్మరక్షణ బానిసత్వం ఆత్మహత్య టాలెంట్ పచ్చబొట్లు పని మిస్టరీస్: [క్యాన్సర్] ౨ కోరింతియన్స్ ౪:౧౬-౧౯[౧౬] కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.౹ [౧౭] మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక౹ [౧౮] క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. [౧౯] భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము.౹ కీర్తనలు ౧౦౭:౨౦ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.యెషయా ౪౦:౩౧యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.ద్వితీయోపదేశకాండము ౩౧:౬భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.౹మాథ్యూ ౧౧:౨౮-౨౯[౨౮] ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. [౨౯] నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. కీర్తనలు ౧౮:౬నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను.ప్రసంగి ౩:౧ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.౹యిర్మీయా ౨౯:౧౧నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹జాన్ ౧౪:౧-౪[౧] మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని.యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.౹ [౨] నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.౹ [౩] నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును.౹ [౪] నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.౹ రోమన్లు ౮:౧౬-౨౫[౧౬] మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.౹ [౧౭] మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. [౧౮] మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.౹ [౧౯] దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.౹ [౨౦] [20-21] ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను.౹ [౨౧] *** [౨౨] సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.౹ [౨౩] అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.౹ [౨౪] ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?౹ [౨౫] మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. ౧ పేతురు ౧:౩[3-4] మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹౨ కోరింతియన్స్ ౧:౩-౬[౩] కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.౹ [౪] దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.౹ [౫] క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.౹ [౬] మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది.౹ Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India